హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : పీజీ లా కోర్సు అయిన ఎల్ఎల్ఎంలో ఈ ఏడాది 90శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 961 సీట్లకు మొదటి విడతలోనే 871 సీట్లు భర్తీ అయ్యాయి. పీజీ లాసెట్ మొదటి విడత సీట్లను సోమవారం కేటాయించారు. సీట్లు పొందిన వారు 5లోగా కాలేజీల్లో రిపోర్ట్‌చేయాలని, 9 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): జవహర్లాల్ నెహ్రూ అరిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జేఎన్ఎఫ్ఏయూ) వైస్‌చాన్స్‌లర్ నియామకం ఆలస్యంకానుంది. కొత్త వీసీలను ఖరారుచేసేందుకు 4,5న సెర్చ్ కమిటీలు సమావేశం కానున్నాయి. 10 వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాల కోసం షెడ్యూల్ రూపొందించారు. జేఎన్ఎఫ్ఏయూ సెర్చ్‌కమిటీలో ఓ సభ్యుడు అందుబాటులో ఉండటంలేదని సమాచారమిచ్చారు. దీంతో ఈ వర్సిటీ మినహా 9 వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
సెర్చ్ కమిటీ సమావేశాలకు నోడల్ అధికారిగా విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత వ్యవహరించనున్నారు. ఇది వరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న బుర్రా వెంకటేశం గవర్నర్ సెక్రటరీగా కూడా ఉన్నారు. వీసీ నియామక ఫైల్ రాజ్‌భవన్ ఆమోదానికి పంపాల్సి ఉండటంతో విద్యాశాఖలో పనిచేస్తున్న హరితకు బాధ్యతలను అప్పగించారు.