BRS | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ముచ్చటగా మూడోసారీ బీఆర్ఎస్సే గెలువబోతున్నది. తెలంగాణలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడబోతున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రముఖ సర్వేలన్నీ తేల్చి చెప్పగా.. తాజాగా, జాతీయ న్యూస్ చానల్ జీ న్యూస్-మెట్రిజ్తోపాటు జీ తెలుగు న్యూస్ వెబ్ చానల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సైతం మరోసారి వెల్లడైంది. రాష్ట్రంలోని మొత్తం 119 సీట్లకుగానూ బీఆర్ఎస్ పార్టీ 43 శాతం ఓట్లతో 70-76 సీట్లు కైవసం చేసుకొంటుందని తేలింది. సీఎంగా మళ్లీ కేసీఆర్‌కే పట్టం కడతామని 36 శాతం మంది వెల్లడించారు. సర్వేలో పాల్గొన్నవారి ప్రకారం సీఎం రేసులో కేసీఆర్‌కు విపక్షనేతలు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం.
ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో జీ న్యూస్-మెట్రిజ్, తెలుగు న్యూస్ ఒపీనియన్ పోల నిర్వహించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 36 శాతం ఓట్లతో 27-33 సీట్లకు పరిమితం అవుతుందని, బీజేపీ 13 శాతం ఓట్లతో 5-8 సీట్లు, ఎంఐఎం 4 శాతం ఓట్లతో 6-7 సీట్లు, ఇతరులు 4 శాతం ఓట్లతో 0-1 సీటు సాధిస్తారని వెల్లడైంది.
పార్టీల వారీగా సర్వే వివరాలు
సీట్లు.. ఓట్ల శాతం