హైదరాబాద్ : జాతీయతా స్ఫూర్తిని చూపించే సమయం ఇది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. ప్రియమైన మోదీజీ తమ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని పాన్-ఇండియా చేయాలి. జాతీయవాదం స్ఫూర్తిని చూపించే సమయం ఇది అని కవిత పేర్కొన్నారు.
వచ్చే నెల నుండి పెద్దలందరికీ మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగనుంది. తమ పౌరులకు ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ అందించనున్నట్లు తెలిపిన రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గోవా, కేరళ, ఛత్తీస్గఢ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అసోం, సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఒడిశా.
Dear Modi Ji, Several States have come forward to provide free vaccine to their people. The Central government should do the same PAN-India. This is the time to show the spirit of Nationalism. @PMOIndia #FreeVaccineForINDIA
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 25, 2021