హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ రేవంత్‌రెడ్డికి తనపార్టీలో ఏం జరుగుతున్నదో తనకే తెలియదు. పార్టీ పరిణామాలపై ఏదో స్టేట్మెంట్ ఇస్తారు. కానీ తర్వాత జరిగేది దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాజకీయ వ్యూహకర్తలు సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిశోర్ విషయంలో జరిగింది ఇదే. ఈ రెండు ఉదాహరణలు రేవంత్‌రెడ్డి నోటి దురుసును, ఆయన మాటల అవిశ్వసనీయతను, రాజకీయ అవివేకాన్ని కూడా బయటపెడుతున్నాయి. ఆయన నాలిక ఎన్నిసార్లు కరుచుకుంటే ఏం లాభం.. సేమ్ స్టోరీ.. నేమ్స్ డిఫరెంట్. అంతే.