తిరువీర్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటించిన గ్రామీణ నేపథ్య రొమాంటిక్ కామెడీ డ్రామా ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. వినోదం, ప్రేమ, నవ్వులతో నిండిన కుటుంబ కథగా ఈ సినిమా అలరిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ నెల 17న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు.