హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మూలచింతలపల్లికి చెందిన బాలరాజు అనే ఫిర్యాదుదారుడిపై పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న అభియోగాల నేపథ్యంలో సంబంధిత సీసీ ఫుటేజీని సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 17 నాటి సీసీ ఫుటేజీ (ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు) సమర్పించాలని పోలీసులకు స్పష్టం చేసిం ది. బాలరాజు అభియోగాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆ జిల్లా ఎస్పీని ఆదేశించింది.