హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 వాయిదా వేయాలని సీహెచ్ చంద్రశేఖర్ సహా 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆగస్టు నెలలో గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, సెప్టెంబర్లో పాలిటెక్నిక్ లెక్చరర్ తదితర పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. ఈ విషయంపై రెండుమార్లు టీఎస్పీఎస్సీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదని, అందుకే పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు.