హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మండిపడ్డారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ సర్పంచులంటే సీఎం రేవంత్రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజాపాలనలో ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ కూడా లేదా? అని నిలదీశారు. అణచివేతలు, అక్రమ అరెస్టుల ద్వారా మాజీ సర్పంచుల ఉద్యమాన్ని రేవంత్ సర్కారు ఆపలేదని స్పష్టం చేశారు.