హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): దేశంలో హింస, ద్వేషపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కొందరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ట్విట్టర్లో మండిపడ్డారు. ముస్లింలపై విద్వేషాలు నూరిపోయడం సరికాదని పేర్కొన్నారు. యువత శాంతివైపు నడవాలని సూ చించారు. దేశం గాంధేయవాదం వై పు నడవాలో? లేదా గాడ్సే మార్గం లో నడవాలో? ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. విషపూరిత రాజకీయాలతో ముస్లింలపై యువతలో ద్వేషమనే విషబీజాన్ని నాటడం సరికాదని, ఇది దేశ భవిష్యత్తుకు మంచి ది కాదని పేర్కొన్నారు.