Indians | హైదరాబాద్: ఎక్కువకాలం జీవిస్తున్న భారతీయుల దీర్ఘాయుష్షుకు తోడ్పడుతున్న జన్యువుల గుట్టు విప్పారు హైదరాబాద్లోని మ్యాప్మైజీనోమ్ సంస్థకు చెందిన పరిశోధకులు. డీఎన్ఏ పరీక్షలకు ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ దీర్ఘాయుష్షు కలిగిన భారతీయుల్లోని జన్యువులపై ఒక అధ్యయనం చేసింది. ఈ వివరాలు ‘ఎన్పీజే ఏజింగ్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
85 ఏండ్లు, ఆపై వయసు కలిగిన భారతీయుల జన్యుపరమైన సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఎంవైహెచ్6, ఈఎస్ఆర్1, ఆర్ఐఎంఎస్1-కేసీఎన్క్యూ5, హెచ్ఎస్పీఏ5 అనే జన్యువులు దీర్ఘాయుష్షు కలిగిన వారిలో ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీర్ఘాయుష్షుకు కారణమయ్యే జన్యువులను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం కీలక అడుగు అని సంస్థ సీఈఓ అనురాధ ఆచార్య తెలిపారు.