కోల్‌సిటీ, సెప్టెంబర్ 16: ‘కాంగ్రెస్ పాలనలో రజకులకు ఒరిగిందేమీలేదు.. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటెయ్యం.. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్కే జై కొడతాం.. ఆ పార్టీ రామగుండం అభ్యర్థి కోరుకంటి చందర్‌ను గెలిపించుకుంటాం’ అని రజక సంఘం పెద్దపల్లి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు పాలడుగు కనకయ్య స్పష్టం చేశారు.
శనివారం ఆయన రామగుండంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రజక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనం నిర్మించి సముచిత ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు. కోర్టు చౌరస్తాలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన కోరుకంటి చందర్‌కే రజకులంతా మద్దతివ్వాలని కోరారు. హస్తం పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి ఆగం కావొద్దని ఆయన సూచించారు.