హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 55 వేల క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగశాఖ గౌరవ సలహాదారు నోరి దత్తాత్రేయులు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఆయన భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నిర్మూలనపై రూపొందించిన పలు అంశాలను దత్తాత్రేయులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్యాన్సర్హ్రిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో ఎక్కడ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయో వైద్యశాఖ అధికారులు గుర్తించాల ని, క్యాన్సర్ బాధితుల డాటాను నమోదు చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్ నివారణపై పరిశోధనలు నిర్వహించాలని ప్రభుత్వా న్ని కోరారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని గు ర్తించి స్క్రీనింగ్ చేయాలని, పాజిటివ్ ఉన్నవారిని సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు రెఫర్ చే యాలన్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటుచేయాలని తెలిపారు.