Telangana Crime | తెలంగాణలో నేర సామ్రాజ్యం.. మూడేండ్లలో 7.15% పెరిగిన నేరాలు!
Telangana Crime | 2023 జూలై నుంచి 2026 జూలై మధ్యలో నేరాల రేటు భారీగా నమోదైంది. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు 2,65,377 నేరాలు నమోదుకాగా, 2024 జూలై నుంచి 2025 జూన్ వరకు 2,77,938 నేరాలు నమోదయ్యాయి.
Telangana Crime | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లో నేరాల రేటు పెరిగిపోతున్నది. అర్ధ వార్షిక నేర సమీక్ష సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2023 జూలై నుంచి 2026 జూలై మధ్యలో నేరాల రేటు భారీగా నమోదైంది. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు 2,65,377 నేరాలు నమోదుకాగా, 2024 జూలై నుంచి 2025 జూన్ వరకు 2,77,938 నేరాలు నమోదయ్యాయి.
2023తో పోల్చితే 2024 లో అత్యంత దారుణంగా 12,516 నేరాలు పెరుగగా, నేరాల్లో 4.73% పెరుగుదల నమోదైంది. 2025 జూలై నుంచి 2026 జూన్ వరకు అదే స్థాయిలో 2,84,363 నేరాలు నమోదైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో 6,425 నేరాలు పెరుగగా, 2.31% పెరుగుదల కనిపించింది. మూడేండ్లలో కేసీఆర్ పాలన 5 నెలలు తీస్తే.. కాంగ్రెస్ పాలనలో దారుణంగా క్రైమ్‌రేట్ నమోదవుతున్నట్టు జాతీయనేర గణాంకాలు, రాష్ట్ర పోలీసు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. మూడేండ్లలో 7.15% నేరాలు పెరుగడం ఆందోళనకరం.
లక్ష జనాభాకు నేరాల రేటు 491.59కి పెరుగుదల
తెలంగాణలో గత మూడేండ్లలో పెరుగుతున్న నేరాలను కట్టడి చేయడంలో హోం శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2023-24, 2025-26లో నమోదైన కేసులు ఆధారంగా తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకూ నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగినట్టు పోలీసు నివేదికలు వెల్లడించాయి. అత్యధికంగా మాదకద్రవ్యాల కేసులు 2023-24లో 2,026 ఉండగా.. 2025-26లో 2,960కు చేరి.. మూడేండ్లలో 46.10% పెరుగుదల దిశగా పయనించాయి. వ్యవస్థీకృత నేరాలు 25 నుంచి 451కు పెరిగి 1,704% పెరుగుదల నమోదు చేశాయి. ట్రాఫిక్ నేరాలు 29,130 నుంచి 31,891కు పెరిగి 9.48% అధికమయ్యాయి. మరోవైపు సైబర్ నేరాలు 25,373 నుంచి 22,000 (13.29%) తగ్గాయి. వీటితోపాటు ఆర్థిక నేరాలు కూడా 37,690 నుంచి 32,684కి (13.28%) క్షీణించాయి.
ఆందోళన కలిగిస్తున్న డ్రగ్స్ కేసులు
తెలంగాణలోని పట్టణాలు గ్రామాలు, నగరాల్లో గంజాయి తిష్ట వేసిందనడానికి నిదర్శనం నమోదవుతున్న డ్రగ్స్ కేసులే. రాష్ట్రంలో నారోటిక్ కేసుల పెరుగుదల పోలీస్ శాఖకు ప్రధాన సవాలుగా మారుతున్నదని ఉన్నతాధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్న పరిస్థితి. ఈ డ్రగ్స్ కేసులు 2023-24లో 2,026 ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయి. లక్ష జనాభాకు ఈ డ్రగ్స్ నేరాల నేరాల రేటు 3.68 నుంచి 5.12కు పెరిగింది. కమిషనరేట్ల వారీగా చూస్తే.. సైబరాబాద్‌లో 266 నుంచి 508కు చేరి 90.98% పెరుగుదల నమోదైంది.
వరంగల్లోనూ గడిచిన మూడేండ్లలో 142.31% పెరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి. డ్రగ్స్ కేసుల నమోదు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 57 నుంచి 219కి పెరిగాయి. నేరాల రేటు 7.22 నుంచి 26.91కు చేరింది. నిజామాబాద్‌లో 62 నుంచి 123కు కేసులు పెరుగుతున్నాయి. నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ డ్రగ్స్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ గణాంకల ప్రకారం మొత్త ం రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్లలో నారోటిక్ కేసులు 46.10% పెరుగడం ఆందోళనకరం.
మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు
- 2024-25లో 31,593గా ఉన్న మహిళలు, చిన్నారులపై నేరాలు.. 2025-26లో 31,108కు తగ్గాయి.
- ఏడాదిలో 1.54% క్షీణత నమోదైంది. అయితే 2023-24తో పోలిస్తే 3.81% ఎకువగా ఉన్నాయి.
- హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లలో కేసులు తగ్గగా.. ఫ్యూచర్‌సిటీలో 790 నుంచి 994కు పెరిగాయి.
- జిల్లాల్లో ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నారాయణపేట, ములుగులో పెరుగుదల కనిపించింది.
తీవ్ర నేరాల్లో 10.33% తగ్గుదల
- తీవ్ర నేరాలు (గ్రేవ్ క్రైమ్) గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయి.
- 2024-25లో 7,019 కేసులు నమోదుకాగా.. 2025-26లో 6,294కు తగ్గాయి. ఏడాది వ్యవధిలో 10.33% తగ్గుదల నమోదైంది.
- లక్ష జనాభాకు నేరాల రేటు 11.21 నుంచి 10.88కు తగ్గింది.
- ప్రధాన కమిషనరేట్లలో హైదరాబాద్‌లో 1,483 నుంచి 1,094కు తగ్గి 26.23% క్షీణత నమోదైంది.
- సైబరాబాద్‌లో 656 నుంచి 613కు, మలాజిగిరిలో 664 నుంచి 549కు తగ్గాయి.
- కొన్ని జిల్లాల్లో తీవ్ర నేరాలు పెరిగాయి. ములుగులో 44 నుంచి 88, నిర్మల్‌లో 66 నుంచి 102, ఆదిలాబాద్‌లో 96 నుంచి 140కు చేరాయి.
- చిన్న, గిరిజన జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి.
సాధారణ నేరాల్లో మూడేండ్లలో 7.28% వృద్ధి
- తీవ్ర నేరాలు తగ్గుతున్నప్పటికీ సాధారణ నేరాలు (నాన్-గ్రేవ్) మాత్రం పెరుగుతున్నాయి.
- 2023-24లో 2,59,201గా ఉన్న కేసులు.. 2025-26లో 2,78,069కు చేరాయి. మూడేండ్లలో 7.28% పెరుగుదల నమోదైంది.
- కమిషనరేట్లలో ఫ్యూచర్‌సిటీలో 23.70%, సైబరాబాద్‌లో 17.32%, మలాజిగిరిలో 13.53% పెరుగుదల నమోదైంది.
- హైదరాబాద్ లో మాత్రం 2.77% తగ్గుదల కనిపించింది.
- జిల్లాల విషయానికి వస్తే కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 70.88%, ఆదిలాబాద్‌లో 60.71% పెరుగుదల నమోదైంది.
- మెదక్, సంగారెడ్డి, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లోనూ సాధారణ నేరాలు పెరిగాయి.
ట్రాఫిక్ నేరాలు 9.48% పెరుగుదల
- రాష్ట్రంలో ట్రాఫిక్ నేరాలు కూడా వరుసగా పెరుగుతున్నాయి.
- 2023-24లో 29,130 కేసులు ఉండగా.. 2025-26లో 31,891కు చేరాయి. మూడేండ్లలో 9.48% పెరిగాయి.
- సైబరాబాద్‌లో 2,882 నుంచి 3,677కు, మలాజిగిరిలో 3,213 నుంచి 3,673కు కేసులు పెరిగాయి.
- హైదరాబాద్‌లో స్వల్ప తగ్గుదల నమోదైంది. వరంగల్‌లో 8.27% తగ్గింది.
- జిల్లాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 154 నుంచి 1,115కు చేరి 624.03% పెరుగుదల నమోదైంది.
- నిర్మల్‌లో 67.92%, నల్లగొండలో 34.37%, ఆదిలాబాద్‌లో 28.30% పెరిగాయి.
- మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్‌లో తగ్గుదల కనిపించింది.
కాంగ్రెస్ పాలనలో నేరాల పెరుగుదల
2023 జూలై- 2024 జూన్ : 2,65,377
2024 జూలై-2025 జూన్ : 2,77,938
2025 జూలై -2026 జూన్ : 2,84,363
రాష్ట్రంలో మూడేండ్లలో పెరిగిన వివిధ కేసులు
మాదకద్రవ్యాల నేరాలు : 46.10%
వ్యవస్థీకృత నేరాలు : 1,704%
ట్రాఫిక్ నేరాలు : 9.48%
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Crime
- crime rate
- murders
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

