యాక్సిడెంట్ నాటకంతో ఫోన్ల చోరీ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బైక్ మీద నుంచి కింద పడిపోయినట్టు నటిస్తూ.. సాయం చేసేందుకు వచ్చిన వారి ఖరీదైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇలా మంగళవారం ఒక్కరోజే ఐదు చోట్ల ఫోన్లను తస్కరించారు. మిర్యాలగూడలోని హెచ్‌పీ గ్యాస్ డీలర్ ప్రతాప్.. కోటక్ మహీంద్ర బ్యాంక్ వద్దకు వచ్చాడు.
మిర్యాలగూడ, జూన్ 11: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బైక్ మీద నుంచి కింద పడిపోయినట్టు నటిస్తూ.. సాయం చేసేందుకు వచ్చిన వారి ఖరీదైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇలా మంగళవారం ఒక్కరోజే ఐదు చోట్ల ఫోన్లను తస్కరించారు. మిర్యాలగూడలోని హెచ్‌పీ గ్యాస్ డీలర్ ప్రతాప్.. కోటక్ మహీంద్ర బ్యాంక్ వద్దకు వచ్చాడు. బ్యాంక్ సమీపంలో ఓ యువకుడు బైక్ పైనుంచి కిందపడ్డాడు. ప్రతాప్ వెంటనే అతడిని పైకి లేపేందుకు వెళ్లగా.. మరో యువకుడు వచ్చి అతను తమవాడేనని ప్రతాప్ జేబులోని ఐఫోన్‌ను దొంగిలించాడు.
బైక్ లేపాక ఇద్దరూ కలిసి అదే బైక్‌పై పారిపోయారు. ప్రతాప్ బ్యాంక్‌లోకి వెళ్లి జేబులో ఫోన్ కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో ఇదే తరహాలో ఇద్దరు యువకులు మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన మోర కృష్ణ సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. ఇలా నలుగురి నుంచి ఫోన్లు కొట్టేసిన గుర్తు తెలియని యువకులు.. పట్టణంలోని ఖలీల్దాబా సమీపంలో ఫోన్ మాట్లాడుతూ రోడ్డు వెంట నడిచి వెళ్తున్న కిశోర్ నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కొని బైక్‌పై పరారయ్యారు. దీంతో బాధితులు తమ ఫోన్లను గుర్తుతెలియని దొంగలు కొట్టేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

