సిద్దిపేట టౌన్, జూన్ 15: మైనర్‌ను లోబరుచుకుని ఉడాయించిన ఘటనలో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దపేటలోని హనుమాన్‌నగర్‌లో గోవిందారం మహేశ్ ఇంట్లో సోలంకి రాధ-విజయ్ దంపతులు మూడేండ్లుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమాని కొడుకు (మైనర్)తో రాధ పరిచయం పెంచుకుంది. బాలుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుని శారీరకంగా దగ్గరైంది. బాలుడితో చెన్నైకి చెక్కేసింది. అక్కడ ఓ రూమ్ కిరాయికి తీసుకుని బాలుడితో ఎంజాయ్ చేసింది. ఈ నెల 6న రాధ బాలుడిని వదిలేయగా ఇంటికి చేరుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిజం బయటపడింది.