ఐదేండ్లలో 1.81 లక్షల కోట్లు
గత ఐదేండ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ తెలిపారు.
- వ్యవసాయ, అటవీ, మత్స్యరంగాల్లో తెలంగాణ సృష్టించిన సంపద ఇది
- ఆ 3 రంగాలు దేశానికే ఆదర్శం
- రాష్ట్ర ప్రగతికి ఆర్బీఐ నివేదికే సాక్ష్యం
- కేసీఆర్ పాలనా దక్షతకు దర్పణం
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గత ఐదేండ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ తెలిపారు. ఈ మూడు రంగాల్లో గత ఐదేండ్లలో రూ.1.81 లక్షల కోట్ల సంపదను సృష్టించడం దేశంలోనే గొప్ప రికార్డు అని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి, అంకితభావం, పరిపాలనా దక్షతకు ఆర్బీఐ నివేదికే నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన కీర్తి, ప్రగతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అభివృద్ధి లేదని విమర్శిస్తున్న వారికి ఆర్బీఐ నివేదికే సమాధానమని స్పష్టంచేశారు. ఉద్యమ కాలంలో ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. వ్యవసాయ, అటవీ, మత్స్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, లక్షల కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అనేక పనులు చేపట్టారని వివరించారు. ఈ మూడు రంగాల్లో 2017-18లో రూ.95,098 కోట్లుగా ఉన్న సంపద 2021-22 నాటికి రూ.1,81,702 కోట్లకు పెం చడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. ఐదేండ్లలో రూ. 86,604 కోట్ల సంపద పెరుగుదల మరే రాష్ట్రంలోనూ సాధ్యం కాలేదని పేర్కొన్నారు.
రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షం
రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మే సీఎం కేసీఆర్.. వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని వినోద్‌కుమార్ తెలిపారు. రైతుబంధు ద్వారానే రైతులకు రూ.58 వేల కోట్లు అందించారని గుర్తుచేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు రూ.353 కోట్లు ఖర్చుచేసి 425 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేశామని, ఆరేండ్లలో రూ.26 వేల కోట్ల సంపదను సృష్టించగలిగామని వివరించారు. హరితహారం తదితర కార్యక్రమాలతో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెరిగిందని పేర్కొన్నారు.
వ్యవసాయ, అటవీ, మత్స్య రంగాల్లో సంపద పెరుగుదల ఇలా (రూ.కోట్లలో)
సంవత్సరం సంపద
2017-18 95,098
2021-22 1,81,702
ఐదేండ్లలో పెరుగుదల 86,604
ఆరేండ్లలో మత్స్య సంపద 26,000
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

