హైదరాబాద్, ఏప్రిల్27 (నమస్తే తెలంగాణ): బోరుబావుల డాటా సేకరణపై కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టిసారించింది. మంగళవా రం (నేడు) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో వర్‌షాప్ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక రంగాల నీటి అవసరాలను తీర్చడంలో భూగర్భ జలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వివిధ సంస్థలు చేపట్టే డ్రిల్లింగ్ కార్యకలాపాల ద్వారా భూగర్భ శిలాశాస్త్రం, బావు ల నిర్మాణం, నీటి నాణ్యతపై ఎంతో విలువైన సమాచారం లభిస్తుంది. దాన్ని శాస్త్రీయ విశ్లేషణ, ప్రణాళిక కోసం ఉపయోగించడం లేదు. దీంతో డ్రిల్లింగ్ డాటా సేకరణలో ప్రమాణాలు నెలకొల్పాలని భూగర్భ విభాగం నిర్ణయించింది.