BSP | హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీఎస్పీ అభ్యర్థుల మూడో జాబితా శనివారం విడుదలైంది. ఇందులో 25 మందిని ఖరారు చేసింది. జంప్ జిలానీలకు సైతం సీట్లను కేటాయించింది. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నారని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ నేత కొత్త మనోహర్‌రెడ్డికి మహేశ్వరం టికెట్‌ను ఇచ్చింది. ఇప్పటి వరకు బీఎస్పీ 87 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరో 32 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది.
25 మందితో బీఎస్పీ మూడవ జాబితా:
1. మహేశ్వరం – కొత్త మనోహర్ రెడ్డి
2. చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్
3. అదిలాబాద్ – ఉయక ఇందిర
4. ఆర్మూర్ – గండికోట రాజన్న
5. నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్
6. బాల్కొండ – పల్లికొండ నర్సయ్య
7. కరీంనగర్ – నల్లాల శ్రీనివాస్
8. హుస్నాబాద్ – పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
9. నర్సాపూర్ – కుతాడి నర్సింహులు
10. సంగారెడ్డి – పల్పనూరి శేఖర్
11. మేడ్చల్ – మల్లేపోగు విజయరాజు
12. కుత్బుల్లాపూర్ – మహ్మద్ లమ్రా అహ్మద్
13. L.B నగర్ – గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్
14. రాజేంద్రనగర్ – రాచమల్లు జయసింహ (రివైజ్డ్)
15. అంబర్ పేట్ – ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్)
16. కార్వాన్ – ఆలేపు అంజయ్య
17. గోషా మహల్ – మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్
18. నారాయణ్ పేట్ – బొడిగెల శ్రీనివాస్
19. జడ్చర్ల – శివ వుల్కుందఖర్
20. అలంపూర్ (ఎస్సీ) – మాకుల చెన్న కేశవరావు
21. పరకాల – అముధాలపల్లి నరేష్ గౌడ్
22. భూపాలపల్లి – గజ్జి జితేందర్ యాదవ్
23. ఖమ్మం – అయితగాని శ్రీనివాస్ గౌడ్
24. సత్తుపల్లి (ఎస్సీ) – సీలం వెంకటేశ్వర రావు
25. నారాయణ్ ఖేడ్ – మహ్మద్ అలాఉద్దీన్ పటేల్
సామాజిక వర్గాల వారీగా:
ఇప్పటివరకు బీఎస్పీ ప్రకటించిన మొత్తం 87 స్థానాల్లో 59 జనరల్ స్థానాలు,17 ఎస్సీ స్థానాలు,11 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. అందులో ఎస్సీ వర్గాలకు 32 స్థానాలు కేటాయించగా బీసీ వర్గాలకు 33 స్థానాలు,ఎస్టీ 13 స్థానాలు జనరల్ 4 స్థానాలు,మైనారిటీలకు 5 స్థానాలు ఉన్నాయి.మరో 32 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనట్టు వెల్లడించారు.