హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): మండలిలో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం గురువారంతో ముగియనున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గే మల్లేశం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంఐఎం సభ్యుడు మీర్జారియాజ్ ఉల్‌హసన్ అఫెండీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి ఉన్నారు. వీరికి గురువారం మండలిలో సన్మానం ఏర్పాటు చేశారు.