ఓఆర్ఆర్ పరిధిలో ఆటో యజమానులకు ఊరట
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో తిరుగుతున్న పాత ఎల్పీజీ/సీఎన్జీ ఆటో యజమానులకు తెలంగాణ రవాణాశాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్/పర్మిట్ బదిలీ చేయాలంటే వాహనానికి చెల్లుబాటులో ఉన్న ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) తప్పనిసరి కావడంతో, వెంటనే స్రాప్ చేయబోయే వాహనానికి కూడా కొనుగోలుదారులు ఎఫ్‌సీ రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చేది.
- ఎఫ్‌సీ రెన్యువల్ చేయకున్నా స్క్రాప్ వెహికల్స్ రిజిస్ట్రేషన్,పర్మిట్ బదిలీ
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో తిరుగుతున్న పాత ఎల్పీజీ/సీఎన్జీ ఆటో యజమానులకు తెలంగాణ రవాణాశాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్/పర్మిట్ బదిలీ చేయాలంటే వాహనానికి చెల్లుబాటులో ఉన్న ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) తప్పనిసరి కావడంతో, వెంటనే స్రాప్ చేయబోయే వాహనానికి కూడా కొనుగోలుదారులు ఎఫ్‌సీ రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చేది. ఇది అనవసర ఆర్థిక భారంగా మారుతున్నదని కమిషనర్‌కు పలు వినతులు అందాయి. ఆ వినతులను పరిగణనలోకి తీసుకున్న రవాణా కమిషనర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఓఆర్ఆర్ పరిధిలోని పాత ఎల్పీజీ/సీఎన్జీ ఆటో-రిక్షాల యాజమాన్యం/పర్మిట్ బదిలీని ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ ఇన్‌సిట్ చేయకుండానే అనుమతిస్తారు. అయితే, బదిలీ పొందిన వ్యక్తి ఆ వాహనాన్ని రోడ్డుపై నడుపబోమని, బదిలీ తేదీ నుంచి మూడు నెలల్లోపు స్రాప్ చేస్తామని అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత రిజిస్టరింగ్ అథారిటీ నిర్దేశిత మూడు నెలల వ్యవధిలోపు వాహనం స్రాప్ అయ్యేలా చూసి, దానికి సంబంధించిన కంప్లయెన్స్‌ను ట్రాక్ చేయాలి. రవాణా కమిషనర్ కార్యాలయంలోని ఐటీ బృందం ఈ తరహా బదిలీలను అనుమతించేలా, అండర్ టేకింగ్, స్రాపింగ్ కంప్లయెన్స్‌ను డాటాబేస్‌లో నమోదు చేసేలా సీఎఫ్ఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను తగిన విధంగా సవరించాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

