హైదరాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): ఒప్పందాన్ని ఉల్లంఘించిన మూడు జాయింట్ వెంచర్(జేవీ) కంపెనీలపై చర్యలు తీసుకున్నట్టు తెలంగాణ హౌసింగ్ బోర్డు వెల్లడించింది. కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకోవడంతోపాటు ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బండ్లగూడలోని ఇందూ ఈస్టర్న్ ప్రొవిన్స్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి 50ఎకరాల్లో రూ. 417కోట్ల విలువైన 10.418ఎకరాలు, కూకట్‌పల్లిలో మధుకాన్ ప్రాజెక్ట్స్‌కు కేటాయించిన 9.04ఎకరాల్లో రూ.600కోట్ల విలువైన 7.92ఎకరాలు, గచ్చిబౌలిలో యూనివర్సల్ రియల్టర్స్‌కు కేటాయించిన 19.95ఎకరాల్లో నిర్మించిన రూ.208కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్టు వెల్లడించారు.
2005-2007 మధ్యకాలంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 20జేవీ ప్రాజెక్టులు చేపట్టగా, అందులో 12 పూర్తయ్యాయని, మిగిలిన 8 ప్రాజెక్టుల్లో కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.