హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టీఏజీ) ఆధ్వర్యంలో బెర్లిన్లోని చారిత్రక వోక్స్ పార్లో వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలు కుటుంబాలు ఒకచోట చేరి ఆట, పాటలతో సంతోషంగా గడిపినట్లు టీఏజీ అధ్యక్షులు డాక్టర్ రఘు చలిగంటి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సంప్రదాయ వంటకాలను పరిచయం చేసినట్లు చెప్పారు. ప్రతి వేసవిలో ఇటీవల వలస వచ్చిన కొత్త కుటుంబాలకు స్వాగతం పలకడంతోపాటు, తెలంగాణ కమ్యూనిటీని బలోపేతం చేసేందుకు ఈ వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రఘు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన టీఏజీ కార్యదర్శులు శరత్, అలేకీ, నరేష్, ఇతర వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.