Vanama Venkateswara Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు అనర్హత పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాద, ప్రతివాదులు ఓటర్ల వద్దకు వెళ్లడానికి బదులు కోర్టుల చుట్టూ తిరిగేందుకు సమయాన్ని వృథా చేసుకోవడంతో ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్యానించింది.
జలగం వెంకట్రావు వేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పులో అభ్యంతరకర వ్యాఖ్యలను తొలిగించాలని వనమా సుప్రీంను ఆశ్రయించిన విషయం విదితమే. ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయని, ఆ ఎన్నికల్లో వాద, ప్రతివాదులు ఇద్దరూ ఓడిపోయారని ధర్మాసనానికి వనమా తరఫు న్యాయవాది తెలిపారు.