బూర్గంపహాడ్, మార్చి 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీసీ పీఎస్‌పీడీలో కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, యాకూబ్‌పాషా పేర్కొన్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో ఐటీసీ యాజమాన్యం ఒత్తిడి మేరకు గురువారం రాత్రి భగ్నమైన కార్మికుల రిలే దీక్షలను ఆదివారం తిరిగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలతోపాటు 14వ వేతన ఒప్పందం జేఏసీతో కలిసి చేయించాలని, కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని.. లేనిపక్షంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రిలేదీక్షకు టీఎన్టీయూసీ గుర్తింపు సంఘం బాధ్యులు కనకమేడల హరిప్రసాద్, రామకోటిరెడ్డి, జీవన్‌రెడ్డి, ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, తాళ్లగొమ్మూరు సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి, బాబు, వర్ధన, రమణమ్మ, ప్రసన్న, స్వరూప, పద్మ, లత, రజిత, భూదేవి సంఘీభావం తెలిపారు.