హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ) : ఎంతోఅరుదుగా కనిపించే పునుగుపిల్లి దారితప్పి అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లికొండలో చోటుచేసుకున్నది. నల్లగా ఒంటిపై మచ్చలతో కూడిన ఓ జం తువు ఒక్కసారిగా జనాల్లోకి రావడంతో వారంతా భయభ్రాంతులకు గరయ్యారు. ఆ తర్వాత ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాన్ని పట్టుకొని మంగళగిరి వెటర్నరీ దవాఖానకు తరలించారు. అంతరించిపోతున్న పునుగుపిల్లి తాడేపల్లికొండలో కనిపించడం ఆశ్చర్యంగా ఉందని, ఇది ఒక్కటే ఉండదని, పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఉండే అవకాశం ఉంటుందని అటవీ అధికారులు గాలింపు చేపట్టారు.