పెద్దపల్లి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వేళ తాయిలాల వల వేసింది. రేపో మాపో ఎన్నికల కోడ్ కూసే సమయంలో రాష్ట్రంలోని మహిళా సంఘాలకు హడావుడిగా ఆదివారం నుంచి ‘మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
హడావుడిగా పెద్ద ఎత్తున గ్రామాలపై చీరలను కుమ్మరించింది. రాత్రి వేళల్లో సైతం మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకాన్ని పూర్తిగా పంచాయతీ ఎన్నికలకు తాయిలాల పథకంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది.