హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసు పైన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ నుంచి వివరాలు తెప్పించుకుని విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. మరోవైపు బండి భగీరథ్ పై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ చేట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.
ఈ నెల 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. కేసు సగ్రమ విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.