MPDO Transfers | ఎంపీడీవోల బదిలీలకు రంగం సిద్ధం.. మే 1లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
MPDO Transfers | మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఇచ్చిన జీవో మేరకు ఎంపీడీవోల బదిలీలు, పోస్టింగ్ కోసం ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం కోరింది.
MPDO Transfers | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఇచ్చిన జీవో మేరకు ఎంపీడీవోల బదిలీలు, పోస్టింగ్ కోసం ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం కోరింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు(సీఈవో), తమ పరిధిలో పనిచేస్తున్న ఎంపీడీవోల పూర్తి వివరాలను సమర్పించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అవసరమైన సమాచారాన్ని హార్డ్, సాఫ్ట్ కాపీల రూపంలో మే 1 లోపు ఈ-సెక్షన్ మెయిల్ ఐడీకి (cpr.e.section@gmail. com) పంపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మే మొదటి వారం తర్వాత బదిలీల తుది జాబితాను వెల్లడించే అవకాశం ఉన్నది.
త్వరలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియను వేగవంతం చేసింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో మేరకు, గ్రేడ్-I, II, III పంచాయతీ కార్యదర్శుల బదిలీ లు, పోస్టింగ్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, తమ పరిధి లో పనిచేస్తున్న అర్హులైన పంచాయతీ కార్యదర్శుల పూర్తి వివరాలను సమర్పించాలని శుక్రవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

