హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ఎస్సెస్సీబోర్డు ప్రకటించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 170 పరీక్షాకేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 51,237 విద్యార్థులు హాజరుకానున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
మిగతా రోజులకు భిన్నంగా ఫస్ట్ లాంగ్వేజ్(కంపోజిట్ కోర్సు)ను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు, సైన్స్ పేపర్లకు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు పరీక్షలుంటాయని పేర్కొన్నారు. వివరాల కోసం 040 -23230942 నెంబర్ను సంప్రదించాలన్నారు.