హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): అంతరిక్ష ప్రయోగంలో విజయవంతమైన స్టార్టప్‌గా గుర్తింపు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్టప్ వర్క్‌షాపును కేంద్ర రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీశ్‌రెడ్డి ఇటీవల సందర్శించారు.
ప్రైవేట్ రంగంలో తొలిసారిగా రూపొందించిన చిన్న రాకెట్ ప్రయోగంతో అంతరిక్ష రంగ పరిశోధనలకు, అభివృద్ధి కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచిన స్కైరూట్ స్టార్టప్ వర్క్‌షాపులో జరుగుతున్న కార్యకలాపాలను వ్యవస్థాపకులతో కలిసి పరిశీలించారు.