హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : టీఎస్ పాలిసెట్-2023 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఫలితాలను రిలీజ్ చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17న పాలిసెట్ నిర్వహించారు. పరీక్షలకు 1,05,742 దరఖాస్తులు రాగా, 98,273 (92%) మంది అభ్యర్థులు హాజరయ్యారు.