Telangana | మనోళ్లే కొలువుల మొనగాళ్లు.. క్రిటికల్ థింకింగ్‌లో దేశంలోనే మొదటిస్థానంలో తెలంగాణ యువత
ఇలా డిగ్రీ పూర్తిచేయగానే, అలా ఉద్యోగాలు పొందగిలిగే యువత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. దేశంలో గరిష్ఠ ఉపాధి సామర్థ్యాలున్న యువత కలిగిన రాష్ర్టాల్లో మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది
- ఉద్యోగ ప్రతిభలో తెలంగాణ టాప్
- క్రిటికల్ థింకింగ్‌లో రాష్ట్ర యువత చాంపియన్
- ఉద్యోగాలు పొందే యువత ఉన్న రాష్ట్రంగా గుర్తింపు
- సంఖ్యానైపుణ్యాల్లోనూ తెలంగాణకు మొదటిస్థానం
- వెల్లడించిన ఇండియా స్కిల్స్ -2024 నివేదిక
- టీహబ్, టీవర్క్స్తో యువతను ప్రోత్సహించిన ఫలితం
కొలువులు సాధించడంలో తెలంగాణ యువత ముందంజలో ఉన్నది. నైపుణ్యసామర్థ్యం, క్రిటికల్ థింకింగ్‌తో గరిష్ఠంగా ఉద్యోగాలను కొల్లగొట్టడంలో తెలంగాణ యువత దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని ఇండియా స్కిల్స్-2024 నివేదిక వెల్లడించింది.
Telangana | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఇలా డిగ్రీ పూర్తిచేయగానే, అలా ఉద్యోగాలు పొందగిలిగే యువత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. దేశంలో గరిష్ఠ ఉపాధి సామర్థ్యాలున్న యువత కలిగిన రాష్ర్టాల్లో మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 18-21 ఏండ్ల వయసున్న వారు తెలంగాణలో 85.45 శాతం ఉపాధిని పొందగలిగే ప్రతిభను కలిగి ఉన్నారు. జాతీయంగా ఇదే అత్యధికం. తరువాతిస్థానాల్లో తమిళనాడు (65.65), బీహార్ (60), పంజాబ్ (58.26), హర్యానా (56.14) టాప్-10లో నిలిచాయి. ఈ ఆసక్తికర విషయాలు ఇండియా స్కిల్స్-2024 నివేదికలో వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. క్రిటికల్ థింకింగ్, సంఖ్యానైపుణ్యాల్లో తెలంగాణ టాప్‌లో ఉన్నది.
నివేదికలో మరికొన్ని విశేషాలు:
- ఇంటర్న్‌షిప్ పట్ల అత్యధికంగా ఏపీ 98.33 శాతంతో మొదటిస్థానంలో ఉండగా, తెలంగాణ 96.72 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. ఇది త్వరగా ఉద్యోగంలో స్థిరపడే వైఖరిని సూచిస్తున్నది. తెలంగాణ తర్వాత పంజాబ్, హర్యానా, బీహార్ టాప్-5లో ఉన్నాయి.
- ప్రతిభావంతులైన యువత, అత్యధిక ఎంప్లాయబుల్ రిసోర్సెస్ ఉన్న రాష్ర్టాల్లో హర్యానా అగ్రగామిగా ఉన్నది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణలో అత్యధికంగా ఉపాధి పొందగల యువత ఉన్నారు.
- న్యూమరికల్ స్కిల్ (సంఖ్యా నైపుణ్యాలు) గల వారిలో 78.68 శాతంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ఏపీ 69.45 శాతం, మహారాష్ట్ర 64.35 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- క్రిటికల్ థింకింగ్ (క్లిష్టమైన ఆలోచన)లో 37.70 శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. విశ్లేషణాత్మక ఆలోచనకు విలువనిచ్చే సంస్కృతి తెలంగాణలోనే అధికంగా ఉండగా, మహారాష్ట్ర 33.15 శాతం, ఏపీ 33.36 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలోని బీఈ, బీటెక్ విద్యార్థులు క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నట్టు నివేదిక విశ్లేషించింది.
- ఆంగ్లభాషా ఉద్యోగ నైపుణ్యాల్లో తెలంగాణ 68.75 శాతంతో రెండోస్థానంలో ఉన్నది.
- కార్పొరేట్ కంపెనీలు రిక్రూట్మెంట్లు చేసుకుంటున్న నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో గల ప్రతిభావంతులైన యువతను అత్యధికంగా రిక్రూట్ చేసుకున్నాయి.
ప్రత్యేక చొరవతోనే..
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టీహబ్, టీవర్క్స్ల ఏర్పాటు చేసి యువ ఇంజినీర్లను ఆంత్రప్రెన్యూర్స్‌గా తయారుచేస్తున్నది. రెండింటినీ సమన్వయం చేయడం ద్వారా అనేక ఆవిష్కరణలు, ఉపాధిని ప్రోత్సహించింది. జిల్లాల్లోనూ ఐటీ టవర్లను ఏర్పాటు చేసి కంపెనీలను విస్తరించింది. కంప్యూటర్ ఎమర్జింగ్ స్కిల్స్ కోర్సులను తీసుకొచ్చింది. ఏఐ, మెషిన్ లర్నింగ్, సీఎస్ఈ, డాటాసైన్స్, రోటోటిక్స్ వంటి కోర్సులను డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశపెట్టింది. ఫలితంగా పరిశ్రమలకు కావాల్సిన వర్క్‌ఫోర్స్‌ను సమకూర్చింది. టీహబ్, టీవర్క్స్ మధ్య సమన్వయం, అనేక హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ చాలెంజ్‌ను ప్రభుత్వ సహకారంతో నిర్వహించినట్టు స్కిల్ ఇండియా నివేదిక కేసీఆర్ ప్రభుత్వ చొరవను కొనియాడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

