హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. గ్రామ పంచాయతీలను గ్రేడ్-1,2,3,4 కింద పునర్వ్యవస్థీకరించి కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్ని రెండేండ్లకు కుదించాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఔట్సోర్సింగ్ నియామకాలను రద్దుచేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఓపీఎస్లను జేపీఎస్‌లుగా మార్చాలని, జీవో-317 ద్వారా నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులను తిరిగి సొంత జిల్లాలకు పంపాలని, పంచాయతీ కార్యదర్శుల చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.