హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీల యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కమిషనర్ కాంతివెస్లీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ సూళ్లుగా నడుపుతున్నందున టీచర్లకు అదనపు పనులు అప్పగించొద్దని, బీఎల్వో విధులను రద్దు చేయాలని, 3 నెలల ఏరియర్స్తోపాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. సుదీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వాలంటరీ రిటైర్మెంట్ అవకాశం కల్పించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రమాతార, కోశాధికారి వేదవతి, ఎల్లమ్మ, శిరీష, పుష్ప, నాగలక్ష్మి, చిన్నమ్మడు, అనిత ఉన్నారు.