KCR | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారు కన్నా గత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 44 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుందని చెప్పగా, రేవంత్రెడ్డి సర్కారు బాగుందని 35 శాతం మంది అభిప్రాయపడ్డారు. రేవంత్రెడ్డి పనితీరుకు ఎన్ని మార్కులేస్తారంటే ఒక్కరు కూడా వంద మార్కులు వేయలేదు. 75 మార్కులేసిన వారు కేవ లం 6 శాతం కాగా, 35 శాతం మంది 50 మార్కులేశారు. అత్యధికంగా 59 శాతం మంది 25 కన్నా తక్కువ మార్కులు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా వోటా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా శాంపిల్ సర్వేను నిర్వహించింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు ఈ సంస్థ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆ సర్వే వివరాలను సంస్థ సీఈవో కంభాలపల్లి కృష్ణ బుధవారం మీడియాకు విడుదల చేశారు.
సర్వేలోని కొన్ని అంశాలు..