హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సమగ్రశిక్ష ఉద్యోగులకు ఒకటో తేదీ పోయింది. ఆఖరుకు మరో పెద్ద పండుగ అయిన దీపావళి కూడా వచ్చింది. కానీ ఈనెల జీతాలింకా అందలేదు. జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయని ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి అభిప్రాయపడ్డారు.
పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. శనివారం మంత్రి సీతకను కలిశారు.
కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందికి ఏడునెలల జీతాలు రాకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ డిమాండ్ చేశారు. శనివా రం కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.