నారాయణరావుపేట, అక్టోబర్ 14 : మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ వాసులు ఒక్కతాటిపై నిలబడి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మరోసారి ఐక్యతను చాటారు. ఈ మేరకు పలు కుల సంఘాల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.1,20,116 జమచేసి బీఆర్ఎస్కు విరాళంగా అందజేశారు. విరాళాలు అందించిన వారిలో అంబేద్కర్ సంఘం, కుర్మ యాదవ, హోలియ దాసరి, రెడ్డి, ముదిరాజ్, మున్నూరు కాపు, రజక, గౌడ, విశ్వబ్రాహ్మణ, ఏకలవ్యులు, వైశ్యులు, నాయీ బ్రాహ్మణులు, మాల, మహిళా సంఘాల ప్రతినిధులు, బీడీ కార్మికులు, రైతుబంధు సభ్యులు, డబుల్ బెడ్రూం లబ్ధిదారులు, వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులు, విజయ డెయిరీ రైతులు తదితరులు ఉన్నారు. సేకరించిన ఈ మొత్తాన్ని సర్పంచ్ దేవయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కే ఎల్లయ్య, వైస్ ఎంపీపీ సంతోష్, సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డికి శుక్రవారం అప్పగించారు.
బడంగ్‌పేట, అక్టోబర్14: దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని తుక్కుగూడ మున్సిపల్ వైస్‌చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కోసం వైస్‌చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి, బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తల, ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఒక్కరోజే రూ.1.8 లక్షలు సేకరించామని, బీఆర్ఎస్ భవన్‌కు చెక్కు రూపంలో అందజేయనున్నట్టు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇస్తున్నారని చెప్పారు. మొదటి దశలో రూ.1.8 లక్షల చెక్కును పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నామన్నారు.