కొత్తూరు, మే 18: దోమలపై యుద్ధానికి రూ.5 లక్షలు వెచ్చించి బ్యాటరీతో నడిచే ఫాగింగ్ మెషిన్‌ను కొనుగోలు చేసింది రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ. తెలంగాణలోనే మొదటిసారిగా ఈ మెషిన్ కొత్తూరు మున్సిపాలిటీకి తెచ్చినట్టు చెప్తున్నారు. నాలుగు గంటలు చార్జింగ్ పెడితే ఏకధాటిగా 120 కిలోమీటర్ల వరకు నడిపించవచ్చు. దీనిలో రెండు ఫాగింగ్ మెషిన్లు ఉంటాయి.
ప్రతి మెషిన్లో 75 లీటర్ల డీజిల్‌కు 3.5 లీటర్ల దోమల నివారణ మందును కలిపి నింపుతారు. మోటర్ స్టార్ట్ చేయడానికి 10 లీటర్ల సామర్థ్యంతో పెట్రోల్ ట్యాంకు ఉంటుంది. దీని ట్రయల్న్ పూర్తయ్యిందని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య తెలిపారు.