మారేడ్‌పల్లి, జూలై 11 : కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేంత వరకు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అధ్యక్షుడు ప్రభాకర్ అండ్రూస్ స్పష్టం చేశారు.
గురువారం సికింద్రాబాద్ సంచాలన్ భవన్ ఎదురుగా ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, రైల్వేలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రైల్వే మంత్రులు, బోర్డు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు.
జోనల్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఈ ధర్నా చేపట్టామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ ఏజీఎస్ రుద్రారెడ్డి, షేక్ రవూఫ్, నాయకులు ప్రసాద్, ప్రభురాజ్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.