హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) ద్వారా డీఈఎల్ ఈడీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ప్రాథమిక స్థాయి టీచర్ పోస్టులకు అర్హులేనని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రకటించింది.
సుప్రీం కోర్టు రివ్యూ కమిటీ తీర్పు మేరకు నిబంధనలు సడలించింది. అన్ని రాష్ర్టాల విద్యాశాఖలకు జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి (ఎన్సీటీఈ) తాజాగా ఆదేశాలిచ్చింది.