కరీంనగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం ధాన్యం సేకరణ, సన్న బియ్యం, సీఎంఆర్ మిల్లింగ్‌పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 27పై మిల్లర్లు మండిపడుతున్నారు. ఈ జీవోలో నిబంధనలు విధించిన స ర్కారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదని వి మర్శించారు. నిజాయతీపరులు, అక్రమార్కులను ఒకే లెక్కన కట్టిపడేయడంపై తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము ధాన్యం దించుకునేది లేదని ఇప్పటికే రా రైస్‌మిల్లర్లు తెగేసి చెప్పడంతోపాటు కలెక్టర్లకు రా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్లు లేఖలు రాశారు. దీనిపై సర్కారు ఇలాగే ఒంటెత్తు పోకడకు వెళ్తే.. రా రైస్‌మిల్లులు మూసుకోవడానికి సిద్ధమే అన్న సంకేతాలను మిల్లర్లు కలెక్టర్లకు తేల్చిచెబుతున్నారు.
ఈ నెల 29న విడుదల చేసిన జీవోలో డిఫాల్టర్లకు ధాన్యం కేటాయించమని చెప్పిన సర్కారు.. ఇదే విషయంలో విధించిన పలు నిబంధనలు నిజాయతీపరులను, అక్రమార్కులను ఒకే లెక్కన కట్టిపడేశాయన్న విమర్శ లు ఉన్నాయి. మిల్లర్లలో దాదాపు సంగం మంది నిబంధనలకు లోబడి సీఎంఆర్ బియ్యం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ రకాల చార్జీలు వెనుకాముందైనా.. నిబద్ధతతో సీఎంఆర్ పూర్తి చేశారు. అటువంటి వారికి జీవో 27లో సర్కారు ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు. ఇన్నాళ్లు నిజాయతీగా నడుచుకున్న మిల్లర్లను కూడా డిఫాల్టర్ల మాదిరిగానే.. బ్యాంకు గ్యారెంటీ, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిబంధన పెట్టడం ఎంత వ రకు సముచితమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అక్రమార్కుల జాబితాలోనే మమ్మ ల్ని లెక్కగడితే.. తమ నిజాయతీకి అర్థమేమిటన్న ప్రశ్నలు వారినుంచి వ్యక్తమవుతున్నా యి. ఈ విషయంలో పునరాలోచన చేయాలన్న డిమాండ్ మిల్లర్ల నుంచి వస్తున్నది.
మిల్లింగ్ చార్జీలను క్వింటాలుకు రూ.150కి పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిల్లర్లు డిమాండ్ చేశారు. మంత్రులతోపాటు ఆ శాఖాధికారులకు ఈ అంశాన్ని లిఖిత పూర్వకంగా తెలిపారు. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో కొంతపెంచినట్టే పెంచి అంతలోనే కొర్రీలు వేయడం పై మిల్లర్ల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్న ది. దొడ్డురకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 30, సన్నాలకు రూ.40 పెంపు చేసిన ప్రభు త్వం.. నిర్ధిష్ట గడువులోగా మిల్లింగ్ చేసిన మిల్లర్లకు మాత్రమే అని షరతు పెట్టింది. చా లా సందర్భాల్లో సీఎంఆర్ బియ్యం రెడీ చేసి ఎఫ్‌సీఐకి పెడుదామంటే.. గోదాముల్లో స్థలం లేక నెలల తరబడి మిల్లుల్లోనే బియ్యాన్ని నిల్వచేసిన రోజులు అనేకం. అంతేకాదు కొన్నిసార్లు రవాణా సౌకర్యం స్తంభించడం, వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడం వం టి కారణాలు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో నిర్ధిష్ట గడువులోపు సీఎంఆర్ ఇవ్వడం కష్టమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద జాప్యం జరిగినప్పుడు.. మిల్లింగ్ చార్జీలు ఎ లా చెల్లింపులు చేస్తారన్న దానిపై స్పష్టత లేద న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా గే ఒక మిల్లర్ ఇన్‌టైంలో 90 శాతం బియ్యం ఇచ్చి అనివార్యకారణాల వల్ల పదిశాతం ఇవ్వలేకపోతే.. మొత్తానికే పెంచిన మిల్లింగ్ చార్జీలు వర్తింపచేయకపోవడం కరెక్టు కాదని మిల్లర్లు వాదిస్తున్నారు. ఇన్‌టైంలో ఇచ్చిన బియ్యంకైనా పెంచిన మిల్లింగ్ చార్జీలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం.. అందుకు తగిన విధంగా కొత్త గోనే సంచులను ఇవ్వాలని ఈ విషయం పై కొత్త జీవోలో స్పష్టతలేదని మిల్లర్లు మండిపడుతున్నారు. పాత గోనే సంచుల్లో బియ్యం నింపితే లక్కపురుగు వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యాన్ని మార్కెట్‌యార్డులు, మహిళా సంఘాలు, సహకార సంఘాల వం టివి కొనుగోలు చేస్తున్నాయని, స్థానిక ఒత్తిళ్లు లేదా ఇతర కారణాలు, లేదా వాతారణ పరిస్థితులు సహకరించనప్పుడు.. ఎఫ్‌క్యూ నిబంధనలు పాటించకుండా కొంటున్నారని మిల్లర్లు పేర్కొంటున్నారు. సదరు ధాన్యాన్ని మార్కెట్ నుంచి నేరుగా మిల్లులకు పంపిస్తే అవుట్‌టర్న్ రేషియో తగ్గుతుందని మిల్లర్లు వివరించారు. తమకు వచ్చిన ధాన్యం ఎఫ్‌క్యూ ప్రకారం ఉం దా? లేదా? అన్నది మిల్లర్లు ఎక్కడ నిర్ధారించాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఒ క అధికారిక కమిటీ నియమించి, వారి ముం దే అవుట్ టర్న్రేషియో తీయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా రారైస్ మిల్లర్స్ అసోసియేషన్లు కలెక్టర్‌కు లేఖలు రాశారు. జీవో 27లోని అన్ని అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్తామని, లేదంటే తమకు ధాన్యం కేటాయింపులు చేయవద్దని కలెక్టర్లకు తెగేసి చెప్పడంతో ప్రస్తుతం కొనుగోళ్లు అధికారులకు సవాలుగా మారింది.