హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ఉత్సవ్ -24 రాష్ట్రస్థాయి వేడుకలు శనివారంతో ముగిశాయి. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో పోటీలను నిర్వహించారు.
ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లో ఎన్ అమిత్‌రాజ్ (నిజామాబాద్), స్టోరీ టెల్లింగ్‌లో ఎస్ అర్షిత (మెదక్), థియేటర్లో ఎన్ వైశాలి బృందం (పెద్దపల్లి), ఓకల్ మ్యూజిక్‌లో చక్రిక బృందం (భదాద్రి కొత్తగూడెం)జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజీవ్, వెంకటస్వామి, జావేద్, తాజ్‌బాబు, కమల్‌సింగ్, ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.