అంతా లోపభూయిష్టమే!.. అనర్హులతో వేదపరీక్షల నిర్వహణ
రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మతపరమైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆసాంతం లోపభూయిష్టంగా కొనసాగుతున్నది. అర్చక, పరిచారక, వేదపారాయణదారు, చండీపారాయణదార్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు విమర్శలున్నాయి.
- ముఖ్య అధికారులు చెప్పినట్టుగా అభ్యర్థులకు ఎగ్జామినర్ల మార్కులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మతపరమైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆసాంతం లోపభూయిష్టంగా కొనసాగుతున్నది. అర్చక, పరిచారక, వేదపారాయణదారు, చండీపారాయణదార్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు విమర్శలున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకుఓ ప్రైవేట్ వేదపాఠశాల నిర్వాహకుడిని నియమించడంపై తెలంగాణ వేదపండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు వేదపండితుల్లో చర్చకు తెరలేపింది.
ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ఫోన్ల ద్వారా తమ ఆవేదనను చెప్పుకొన్నట్టు తెలిసింది. వారి కథనం ప్రకారం.. హైదరాబాద్లోని ఓ ఆంజనేయస్వామి దేవాలయంలో పోస్టు కోసం పరీక్ష నిర్వహించేందుకు వచ్చిన ఐదుగురిలో ఒక్కరికీ సంబంధిత సబ్జెక్టుతో సంబంధం లేదు. దీంతో వారిలో ఓ అధికారి చెప్పిన వారికే మార్కులు వేసినట్టు తెలుస్తున్నది.
అలాగే రాష్ట్రంలోని ప్రముఖ రామాలయం, శివాలయంతోపాటు మరో ఆలయంలోని పోస్టులు తాము చెప్పినవారికే దక్కేలా మార్కులు వేయాలని ఎగ్జామినర్లకు ముఖ్య అధికారులు హుకుం జారీచేసినట్టు తెలిసింది. దీనిపై తెలంగాణ వేదపండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలున్న ఇక్కడి వారికి కాకుండా ఇతర ప్రాంతానికి చెందిన వారికి పరీక్షల నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టడం వల్లనే ఈ అవకతవకలు జరిగాయని, దీంతో స్థానిక పండితులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

