హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్లో సంస్కృతం రగడపై ఎట్టకేలకు ఇంటర్ విద్యాశాఖ స్పందించింది. రోజుకో వివాదానికి దారితీస్తుండటంతో శుక్రవారం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో తెలుగుకు ప్రత్యామ్నాయంగా సం స్కృతం ప్రవేశపెడుతున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇంటర్ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) జయప్రదబాయి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్లో 10 సంస్కృతం లెక్చరర్ పోస్టులు భర్తీ అయ్యాయని, వారికి పోస్టింగ్ఇవ్వడం కోసం పలు వివరాలపై ఆరా తీశామని తెలిపారు.