హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొంటున్న నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. భవనం డోమ్‌పై ఏర్పాటు చేసిన మూడు సింహాల చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. మరోవైపు సచివాలయం సమీపంలోనే తుది రూపు దిద్దుకుంటున్న అమరవీరుల స్మారక భవనం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో చూడముచ్చటైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నది.