స్థానికతపై ద్వంద్వ విధానం తగదు.. స్థిరమైన ప్రమాణాలను పాటించాలన్న హైకోర్టు
ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికత నిర్ధారణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అమలు చేస్తున్న విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టీజీపీఎస్సీ ద్వంద్వ విధానాన్ని అమలు చేస్తున్నదని తేల్చింది.
- టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, జూన్22 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికత నిర్ధారణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అమలు చేస్తున్న విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టీజీపీఎస్సీ ద్వంద్వ విధానాన్ని అమలు చేస్తున్నదని తేల్చింది. ఒక సందర్భంలో అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదువలేదన్న కారణంతో అభ్యర్థిని స్థానికుడిగా గుర్తించలేదని, మరో సందర్భంలో 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ వెలుపల చదివారనే కారణంతో స్థానికతను నిరాకరించిందని పేర్కొంటూ.. ఇది సరైన విధానం కాదని స్పష్టం చేసింది. స్థానికత నిర్ధారణకు చట్టబద్ధంగా నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించడంలో టీజీపీఎస్సీ విఫలమైందని ఆక్షేపించింది.
రాష్ట్రపతి ఉత్తర్వులు-2018లోని పేరా-7లో పేర్కొన్న నిబంధనలను విడివిడిగా కాకుండా సమగ్రంగా చదువాలని, వాటికి సంబంధించిన వ్యాఖ్యానాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమిష్టిగా అమలు చేయాలని పేర్కొన్నది. స్థానికత విషయంలో రాజ్యాంగబద్ధ సంస్థగా టీజీపీఎస్సీ స్థిరమైన, ఒకే తరహా ప్రమాణాలను పాటించాలని ఆదేశించింది. 2022 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నియామకాల వ్యవహారంలో పీ నిశాంత్ అనే అభ్యర్థిని స్థానికుడిగా పరిగణించాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం తీర్పు వెలువరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

