హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ములుగు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు మంజూరుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన నియోజకవర్గానికి రూ.2.6 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఈ ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే నిధులను విడుదల చేయలేదని పేరొంటూ ములుగు ఎమ్మెల్యే సీతక హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై జస్టిస్ చిల్లకూరు సుమలత శుక్రవారం విచారణ చేపట్టారు. నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేశారు.