హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్, చీఫ్ మేనేజర్ బీసీ విజయ పుష్పకుమారికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు పరపతి సహకార సంఘానికి బకాయిల చెల్లింపు విషయంలో సంస్థ యాజమాన్యం కోర్టు ఆదేశాలను పాటించడం లేదని ఆ సంఘం ధిక్కార పిటిషన్ను దాఖలు చేయడంతో ఇటీవల ఈ నోటీసులు జారీ అయ్యా యి.
కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.