హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్పౌజ్, పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు గురువారం సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు బదీల కోసం ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): 2008బ్యాచ్‌కు చెందిన 127మందికి పదోన్నతులు కల్పించడంపై నీటిపారుదలశాఖ ఏఈఈలు హర్షం వ్యక్తంచేశారు.
సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఇంజినీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఈఈలు గురువారం ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.