కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్ నగర్ : కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, జీవిత బీమా, దవాఖానలో సౌకర్యాలు వంటివి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పించినట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ దవాఖాన అభివృద్ధి సంస్థ కమిటీలో కార్మిక సంఘ నాయకులను కూడా ఒకరిని సభ్యులుగా చేరుస్తామని మంత్రి ప్రకటించారు. గతంలో హమాలీలు, ప్రత్యేకించి కార్మికులు తక్కువ వేతనాలతో అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, అలా కాకుండా ప్రస్తుతం పెరిగిన వేతనాలు కూడా కార్మికులకు త్వరలోనే అందనున్నాయి.
దీని ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగవ్వటమే కాకుండా, ఇన్సూరెన్స్ ,ఇతర సౌకర్యాలు కూడా వస్తాయని తెలిపారు. జిల్లాలో కార్మికులు అంటే కాటన్ మిల్లులో పనిచేసే వారు, మున్సిపాలిటీ కార్మికులు ఉండేవారని… ప్రస్తుతం దవాఖానలో వందల మంది కార్మికులు పనిచేస్తున్నారని వారందరూ కార్మికులుగా గుర్తింపు పొందుతున్నారని తెలిపారు.
డాక్టర్లతో పాటుగా కార్మికులు చేస్తున్న కృషి వల్లనే జిల్లా హాస్పిటల్‌కు మంచి పేరు వచ్చిందని, ప్రభుత్వ దావాఖాన అంటే ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. 250 పడకలతో కొవిడ్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని… ఇక్కడ పనిచేసే కార్మికులు దవాఖానను 24 గంటలు పరిశుభ్రంగా ఉంచుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి దవాఖానలో ఏర్పాటు చేసిన జనరేటర్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్, వైస్ చైర్మన్ గణేష్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
అంబులెన్స్‌లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

